Sat Jan 31 2026 18:33:28 GMT+0000 (Coordinated Universal Time)
పుంగనూరులో టెన్షన్.. టీడీపీ కార్యకర్తల రాళ్లదాడి
పుంగనూరులో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి పర్యటనను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు వచ్చారు

పుంగనూరులో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి పర్యటనను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు వచ్చారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిధున్ రెడ్డి వచ్చారు. అయితే మిధున్ రెడ్డి రెడ్డప్ప ఇంటికి వచ్చారని తెలిసి పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ఆ ఇంటిపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక్కడి నుంచి మిధున్ రెడ్డి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు.
పోలీసులు వచ్చి...
దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రాళ్లు విసురుతున్న టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. మిధున్ రెడ్డి అక్కడి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. బయటకు వెళితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని భావించి మిధున్ రెడ్డిని రెడ్డప్ప ఇంట్లోనే కొద్దిసేపు ఉండాలని పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా మిధున్ రెడ్డి మాట్లాడుతూ ఇలా ఒక పార్లమెంటు సభ్యుడిని నియోజకవర్గం పర్యటనను అడ్డుకోవడం సరికాదని అన్నారు.
Next Story

